- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నటీనటుల రెమ్యూనరేషన్లపై ప్రభుత్వం ఎందుకు మాట్లాతుందని చిరు ప్రశ్నించారు. యాక్టర్స్‌కు డిమాండ్, ఆదరణ ఉన్నప్పడు వారికి రెమ్యూనరేషన్లు కూడా ఎక్కువే ఉంటాయని నొక్కి చెప్పారు. పిచ్చుక మీద బ్రహ్మస్త్రంలాగా సినీ పరిశ్రమపై పడ్డారని మండిపడ్డారు.
ప్రభుత్వం ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధికల్పన దృష్టి పెట్టాలని సూచించారు. ఉద్యోగ, ఉపాధిపై ప్రభుత్వం దృష్టి పెట్టినప్పుడే ప్రజలు మెచ్చుకుంటారని చెప్పారు. ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని.. అప్పుడు వారిని ప్రజల గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాయని తెలిపారు. కాగా, ఇటీవల పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్‌పై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తరచూ ప్రస్తావిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చేసిన పై వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
Read More: Akkineni ఫ్యామిలీలోకి కొత్త మెంబర్.. కొడుకుల కోసం Nagarjuna అంత పని చేశాడా?
పకోడి సలహాలు మాకొద్దు : మెగాస్టార్ చిరంజీవికి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్