- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరంజీవికి ఇష్టమైన హీరో-హీరోయిన్ ఎవరో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్:150 కి పైగా చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి సుపరిచితమే. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తిగా చెప్పుకుంటారు. తన నటన, డాన్స్‌తో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. చిరుతో పాటు తన ఫ్యామిలీ వారసులను కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి తీసుకొచ్చి.. ప్రస్తుతం స్టార్ హీరోలుగా నిలబెట్టాడు. 68 ఏళ్లలో కూడా యంగ్ హీరోలకు సైతం పోటీపడుతూ సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతున్నారు. ఇక రీసెంట్‌గా చిరంజీవి పద్మ విభూషన్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై రాజ్ భవన్‌కు పిలిపించుకుని మరీ సన్మానించారు.
ఇంతటి ప్రతిష్టను సంపాదించుకున్న మెగాస్టార్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త కుదిపేస్తోంది. చిరుకు ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్ ఎవరంటూ జనాలు ఆరా తీయడం మొదలుపెట్టారు. కాగా ఈ హీరో పలు సందర్భాల్లో దివంగత సౌందర్య, రాధిక, రాధ అని చెప్పుకొచ్చారు. సౌందర్య ప్రవర్తించే తీరు, మాట్లాడే పద్ధతి కానీ, అన్నీ ఎంతో చక్కగా ఉంటాయని చెప్పుకొచ్చారు. సౌందర్యతో నటించడం చాలా కంఫర్ట్ గా ఉంటుందని తెలిపారు. మళ్లీ అలాంటి హీరోయిన్ పుట్టే చాన్సే లేదంటూ సౌందర్యపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇక రాధిక, రాధలతో నిత్యం ఫోన్‌లో టచ్‌లో ఉండేవాళ్లమని, రాధికనైతే ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటానని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక మెగాస్టార్‌కు ఇష్టమైన హీరో విషయానికొస్తే.. జూనియర్ ఎన్టీఆర్ అంటే.. ఆయన నటన అంటే ఎంతో ఇష్టమని తెలిపారు.
Read More...
ఎన్నిసార్లైనా తగ్గేదే లే.. ‘పుష్ప 2’ నుంచి ఫస్ట్ సాంగ్ ఔట్.. వింటే పూనకాలే!!