మెగాస్టార్ లేడు ఎవరు లేరు.. నేనే మెగాస్టార్.. అంటున్న అల్లు అర్జున్‌పై చిరు ఫ్యాన్స్ ఫైర్

by Prasanna |   ( Updated:2023-08-15 13:22:43.0  )
మెగాస్టార్ లేడు ఎవరు లేరు.. నేనే మెగాస్టార్.. అంటున్న అల్లు అర్జున్‌పై చిరు ఫ్యాన్స్ ఫైర్
X

దిశ, సినిమా: ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి హీరోగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన సాధించిన విజయాల ముందు ఇప్పుడున్న ఏ హీరో కూడా పనికిరాడని చెప్పాలి. ఇక చిరు.. పవన్ కళ్యాణ్ నుంచి మొదలు తన ఫ్యామిలీ నుంచి వరుస పెట్టి హీరోలను తెరపైకి తీసుకొచ్చాడు. ఆ మెగా హీరోల లిస్ట్‌లో అల్లు అర్జున్ కూడా ఒక్కడు. కానీ ‘పుష్ప’ లాంటి బిగ్ హిట్ కొట్టిన తర్వాత బన్ని ఎక్కడ చూసిన అతి చేస్తున్నాడని, ఇండస్ట్రీలో ‘నేనే నెంబర్ వన్ హీరో’ అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడని తెలుస్తోంది. అంతేకాకుండా అక్కడ మెగాస్టార్ టాపిక్ వస్తే మెగాస్టార్ లేడు, ఎవరు లేరు, నేనే ఇప్పుడు ఇండస్ట్రీకి మెగాస్టార్ అని అంటున్నాడట. దీంతో ట్రేడ్ పండితులు ‘చిరంజీవి కొట్టిన ఇండస్ట్రీ హిట్టుతో పోలిస్తే నీ సినిమాల సక్సెస్ పనికిరాదు’ అంటున్నారు. ఇక చిరంజీవి ఫ్యాన్స్ అయితే ‘చిరంజీవి అంటే రికార్డులకి మొగుడు. నువ్వు ఇంతవరకు ఎన్ని హిట్లు కొట్టారు. ఒక్కసారి నీ లైఫ్ జర్నీ చూసుకో. కెరీర్ స్టార్టింగ్‌లో ఐదు సంవత్సరాలకే ఐదు ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు చిరంజీవి. నువ్వు ఒక్కటి కొట్టి ఆగట్లేదు’ అని విరుచుకుపడుతున్నారు.

Advertisement

Next Story