Matka Teaser: మనకు ఏది అవసరమో అదే ధర్మం.. హైప్ పెంచుతున్న ‘మట్కా’ టీజర్

by Hamsa |   ( Updated:2024-10-05 11:40:47.0  )
Matka Teaser: మనకు ఏది అవసరమో అదే ధర్మం.. హైప్ పెంచుతున్న ‘మట్కా’  టీజర్
X

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘మట్కా’. ఈ సినమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా.. మట్కా చిత్రాన్ని విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ప్రజెంట్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని 1958-1982 మధ్య కాలంలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా చేసుకొని తెరకెక్కిస్తున్నారు.

వైజాగ్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న మట్కాలో వరుణ్ ఏకంగా నాలుగు గెటప్స్‌లో కనిపించనున్నట్లు సమాచారం. అయితే దీనిని నవంబర్ 14న థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఇందులోంచి రిలీజ్ అయిన పోస్టర్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, మట్కా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

‘‘ఈ దేశంలో చలామణి అయ్యే ప్రతి రూపాయిలో 90 పైసలు నూటికి ఒక్కడే సంపాదిస్తాడు. మిగతా 10 పైసల కోసం 99 మంది కొట్టుకుంటారు. మనకు ఏది అవసరమో అదే ధర్మం. మనుషుల ఆశ సావనంత వరకు నా వ్యాపారానికి చావు ఉండదు’’ అని వరుణ్ చెప్పే డైలాగ్స్ కొన్ని సినిమాపై హైప్‌ను క్రియేట్ చేస్తూ అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి.

Advertisement

Next Story