ఒకే ఫ్రేమ్‌లో మెగా, అల్లు ఫ్యామిలీ.. హైలెట్‌గా నిలిచిన అకీరా-ఆద్య.. పండగ కళ ఉట్టిపడుతోంది!

by Anjali |   ( Updated:2024-01-17 07:33:02.0  )
ఒకే ఫ్రేమ్‌లో మెగా, అల్లు ఫ్యామిలీ.. హైలెట్‌గా నిలిచిన అకీరా-ఆద్య.. పండగ కళ ఉట్టిపడుతోంది!
X

దిశ, సినిమా: మెగా ఫ్యామిలీ అండ్ అల్లు ఫ్యామిలీ ఒక్కచోట చేరి సంక్రాతి పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ ఇద్దరి ఫ్యామిలీ మెంబర్స్‌ అంతా కలిస్తే చూడాలని మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తారు. కాగా ఇరుకుంటుంబాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో మెగా ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి ‘‘పాడి పంటలతో, భోగ భాగ్యాలతో ఈ సంక్రాంతి ప్రతి ఇంటా ఆనందాల పంటలు పండించాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’’ అని అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఫ్యామిలీ ఫొటోను పంచుకున్నారు.

ఈ ఫ్యామిలీ ఫొటోలో చిరు, నాగబాబు, అల్లు అరవింద్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్, కొత్త కోడలు లావణ్య త్రిపాఠి, అల్లు స్నేహా రెడ్డి, ఉపాసన కొణిదెలతో పాటు కూతుర్లు, మనవరాళ్లు, మనవళ్లు, బంధువులంతా ఉన్నారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అకీరా, ఆద్య మెగా ఫ్యామిలీతో కలిసి కనిపించడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ‘వెరీ హ్యాపీ’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అలాగే ఉపాసన-రామ్ చరణ్ క్లీంకారతో దిగిన ఫొటోను, పండగ సందర్భంగా చరణ్‌‌తో జాలిగా గడుపుతున్న పిక్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. కానీ క్లీంకార ఫేస్‌ను కవర్ చేసి చూపించడంతో మెగా ఫ్యాన్స్.. మెగా ప్రిన్సెస్ ఫేస్ ఎప్పుడు రివీల్ చేస్తారంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed