నా జీవితం పూల పాన్పు కాదు.. మీనాక్షి ఎమోషనల్ పోస్ట్ వైరల్

by Anjali |   ( Updated:2023-09-07 08:11:13.0  )
నా జీవితం పూల పాన్పు కాదు.. మీనాక్షి ఎమోషనల్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: మహేష్ బాబు సినిమా ‘గుంటూరు కారం’తో ప్రేక్షకుల ముందుకు రానున్న మీనాక్షి చౌదరి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ మేరకు సూర్య కిరణాల వెలుతురులో రోడ్డుపై నడుస్తున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘కష్టం, సుఖం, పరిస్థితి ఏదైనా చిరునవ్వుతో ముందుకుసాగాలి. కొన్నేళ్ల క్రితం ఎన్నో భావోద్వేగాలతో నా లైఫ్ రోలర్ కోస్టర్ రైడ్‌లా సాగింది. ఎన్నోసార్లు కిండపడ్డాను. అయినా స్వయం కృషితో మళ్లీ బలంగా తిరిగి లేచా. అలా ఆత్మపరిశీలనతో జీవితాన్ని చూసే విధానం మారింది.

ప్రతి దశలోనూ చిరునవ్వు నాకు తోడుగా ఉంది. కాలంతోపాటు పరిస్థితులు కూడా మారుతాయనే విషయం అర్థమైంది. కాబట్టి మన లైఫ్‌లో కష్టాలు ఎదురవుతున్న ప్రతిసారి చిరునవ్వు చిందించిన క్షణాలను గుర్తు చేసుకోవాలి’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుండగా ‘గుంటూరు కారం’ మూవీ 2024 జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదలకానుంది.

Advertisement

Next Story

Most Viewed