నాకు దక్కాల్సిన క్రెడిట్ వాళ్లే లాగేసుకున్నారు.. యాంకర్ ఝాన్సీ

by Prasanna |   ( Updated:2023-05-08 08:03:54.0  )
నాకు దక్కాల్సిన క్రెడిట్ వాళ్లే లాగేసుకున్నారు.. యాంకర్ ఝాన్సీ
X

దిశ, సినిమా: బుల్లితెర స్టార్ సీనియర్ యాంకర్స్‌లో ఝాన్సీ ఒకరు. ఉదయభాను, సుమతో పాటు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా రీసెంట్‌గా ‘దసరా’ మూవీలో హీరోయిన్ తల్లిగా నటించన ఆమె.. తాజా ఇంటర్య్వూలో కెరీర్‌కు సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంది. ‘చాలామందికి నా గురించి తెలియదు. నాకు పొగరు.. మాట్లాడితే విప్లవం అంటుందని భావిస్తారు. కానీ నాతో కలిసి మాట్లాడితే నేను ఏమిటనేది వారికి అర్థమవుతుంది. ఇక ప్రొఫెషనల్‌గా కొన్ని ఛానెల్స్ నాతో ఎపిసోడ్‌లు చేయించుకొని నచ్చలేదని చెప్పకుండానే షో ముంగించేవారు. మళ్లీ అదే షో వేరే వారితో 100 ఎపిసోడ్‌లు నడిపించేవారు. ఇలా చాలాసార్లు మోసపోయాను. అది గుర్తుపెట్టుకుని కక్ష సాధించడం నాకు చేతకాదు. అది నా మంచితనమో.. పిచ్చితనమో తెలియదు. అలా నాకు రావాల్సిన క్రెడిట్ దక్కకుండా చేసిన సందర్భాలున్నాయి’ అంటూ గుర్తుచేసుకుంది ఝాన్సీ.

Read more:

‘రాత్రంతా అదే పని.. రోజంతా ఇలా’ సామ్ పోస్ట్ వైరల్

నాకు దక్కాల్సిన క్రెడిట్ వాళ్లే లాగేసుకున్నారు.. యాంకర్ ఝాన్సీ

Advertisement

Next Story