విషమంగా హీరోయిన్ ఆరోగ్యం.. ఆందోళనలో ఫ్యాన్స్!

by Jakkula Samataha |
విషమంగా హీరోయిన్ ఆరోగ్యం.. ఆందోళనలో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మళయాళ హీరోయిన్ అరుంధతి నాయర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తన బ్రదర్‌తో పాటు బైక్ పై వెళ్తున్న క్రమంలో కారు వచ్చి వీరి బైక్‌ను ఢీ కొంది. ఈ యాక్సిడెంట్‌లో నటి తలకు తీవ్రంగా గాయమైంది. కాగా, ప్రస్తుతం అరుంధతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తలకు బలమైన గాయం కావడంతో మెదడులో రక్తం గడ్డ కట్టింది, పక్కటెముకలు విరిగిపోయాయని వైద్యులు తెలిపారు. దీంతో ఆర్థిక సాయం కోరుతూ పలువురు స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక ఈ నటి 2014లో పొంగు ఏజ్హు మనోహర అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. విజయ్ ఆంటోని బేతాళుడు సినిమాతో ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

Advertisement

Next Story

Most Viewed