రోడ్డు ప్రమాదంలో ప్రముఖ యువ నటుడు మృతి

by Mahesh |   ( Updated:2023-06-05 07:10:27.0  )
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ యువ నటుడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సౌత్ యాక్టర్ కొల్లం సుధి(39) మృతి చెందారు. ఈ విషాద సంఘటన తెల్లవారుజామున 4.30 గంటలకు కైప మంగళం వద్ద కారును ట్రక్కు ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న కొల్ల సుధి అక్కడిక్కడే మృతి చెందగా.. ఉల్లాస్ అరూర్, బిను ఆదిమలి, మహేశ్‌లు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదంలో మృతి చెందిన కొల్లం సుధి.. మొదట మిమిక్రీ ఆర్టిస్టుగా,, ఆ తర్వాత స్టార్ మ్యాజిల్కి ప్రవేశించి.. మలయాళ టీవీ ప్రేక్షకుల ఇంటి పేరుగా మారాడు. అలాగే.. 2015లో 'కంఠారి' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 'కట్టప్పనయిలే హృతిక్ రోషన్', 'కేశు ఈ వీడింటే నాధన్' తదితర సినిమాల్లో కూడా నటించారు. ఉహించని రోడ్డు ప్రమాదంలో కొల్లం సుధి మృతి చెందడంతో.. ఆయన అభిమానులు, తమిళ టీవీ ప్రేక్షకులు కన్నీరు పెట్టుకున్నారు.

Also Read: న్యూడ్ ఫోటో షేర్ చేసిన ప్రియాంక చోప్రా !

Advertisement

Next Story