ట్రాన్స్‌ఫరెంట్ చీరలో కుర్రాళ్లను కవ్విస్తోన్న మలయాళీ బ్యూటీ

by Anjali |   ( Updated:2024-02-07 11:25:27.0  )
ట్రాన్స్‌ఫరెంట్ చీరలో కుర్రాళ్లను కవ్విస్తోన్న మలయాళీ బ్యూటీ
X

దిశ, సినిమా: కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహన్. ప్రస్తుతం ఈ అమ్మడు భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌ లో వరుస ఆఫర్లు దక్కించుకుంటుంది. ఇప్పుడు బాహుబలి చిత్రంతో రికార్డులు బ్రేక్ చేసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘రాజా సాబ్’ లో అవకాశం కొట్టేసింది. ప్రభాస్ సరసన నటించబోతుందంటూ సోషల్ మీడియాలో ఈ అమ్మడు పేరు గట్టిగానే వినిపిస్తోంది. మాళవిక ఇందులో నటించినట్లైతే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే మొదటి సినిమా అవుతుంది.

ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌ రెబల్ స్టార్ ఫ్యాన్స్‌లో భారీ హైప్‌ను పెంచుతుంది. అయితే తాజాగా మాళవిక ట్రాన్స్‌ఫరెంట్ శారీ కట్టుకుని సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఓ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం కోసం ఈ బ్యూటీ శారీ కట్టుకుని స్టన్నింగ్ ఫొటో షూట్ చేసింది. గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తున్న ఈ పిక్స్ తన అభిమానులతో పంచుకోగా.. హాట్ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతున్న ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల విషయానికొస్తే.. త్వరలో మాళవికా మోహన్ ‘తంగలాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement

Next Story

Most Viewed