మహేష్ ఫ్యాన్స్‌కు పండగే.. 'SSMB 28' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్

by sudharani |   ( Updated:2023-02-04 13:03:34.0  )
మహేష్ ఫ్యాన్స్‌కు పండగే.. SSMB 28 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్
X

దిశ, సినిమా: వరుస సినిమాలతో మంచి ఫామ్‌లో ఉన్న మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మూవీ అనౌన్స్ అయి ఇన్ని రోజులైనా ఇప్పటికీ అప్‌డేట్ ఇవ్వని మేకర్స్.. తాజాగా అదిరిపోయే వార్తను అందించారు. ఈ చిత్ర నిర్మాత నాగవంశీ ఇందుకు సంబంధించిన హింట్ ఇచ్చారు.

'బుట్టబొమ్మ' ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన.. ఆల్రెడీ జనవరి 18 నుంచి సినిమా షూటింగ్ జరుగుతుందని, ఆగస్టు 11న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశామని చెప్పుకొచ్చాడు. పూజా హెగ్డే, శ్రీలీల ఇద్దరూ కూడా అమేజింగ్ రోల్స్‌లో కనిపించబోతున్నట్లు వివరించాడు. ఫస్ట్ అండ్ సెకండ్ హీరోయిన్ అనేది ఏమీ లేదని, ఇద్దరూ కూడా మంచి క్యారెక్టర్స్‌ చేయబోతున్నారని తెలిపాడు.

READ MORE

ప్రముఖ సింగర్ వాణీజయరాం మృతిపై అనుమానాలు

Advertisement

Next Story