- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభాస్‌ను ఫాలో అవుతున్న మహేష్.. ఎందుకో తెలుసా?
దిశ,సినిమా: రీసెంట్గా రెబల్ స్టార్ ప్రభాస్ తన పెద్దనాన్న కృష్ణంరాజు సంస్మరణ సభను స్వగ్రామం మొగల్తూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష మందికి పైగా వచ్చినట్టు తెలుస్తోంది. ఇకపోతే ప్రతి ఒక్కరు కడుపునిండా తిని వెళ్లాలని ప్రభాస్ ఫ్యాన్స్‌కు సూచించారు. సభకు వచ్చిన వారందరికీ 50 రకాలకు పైగా వంటకాలతో భోజనాలు వడ్డించారు. దీనికోసం దాదాపు రూ. 3 కోట్ల వరకు ఖర్చు చేశారు.
అయితే ఇదే పద్ధతిని ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. కృష్ణ భార్య, మహేష్ తల్లి ఇందిర గత నెల 28న మరణించగా శనివారం ఆమె పెదకర్మ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇప్పుడు తన తల్లి సంస్మరణ సభను సొంత ఊరు అయిన బుర్రిపాలెంలో ఈనెల 16న నిర్వహించబోతున్నట్లు సమాచారం. కాగా ఈ కార్యక్రమానికి కృష్ణ కుటుంబ సభ్యులతోపాటు తన అభిమానులందరికీ మహేష్ ఆహ్వానం పలుకుతారని టాక్ వినిపిస్తోంది.
ALSO READ : పవిత్రమైన ప్రదేశంలో పాడుపని.. చిత్రబృందంపై దాడిచేసిన స్థానికులు