దేవుని రూపంలో దర్శనమిచ్చిన మహేష్ బాబు.. కలకలం సృష్టిస్తున్న ఫ్లెక్సీ

by Hamsa |   ( Updated:2024-01-12 09:49:52.0  )
దేవుని రూపంలో దర్శనమిచ్చిన మహేష్ బాబు.. కలకలం సృష్టిస్తున్న ఫ్లెక్సీ
X

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలైంది. దీంతో సినిమా చూసేందుకు వెళ్లిన ఫ్యాన్స్ థియేటర్ల చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అమలాపురం మహేష్ బాబు ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. కృష్ణుడి రూపంలో ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేసి కొబ్బరికాయలు కొట్టే స్థలం అని రాసి పెట్టారు. ఈ ఫ్లెక్సీ నెట్టింట వైరల్ కావడంతో పలువురు విమర్శలు చేస్తున్నారు. అలాగే కొన్నిచోట్ల అభిమానుల రోడ్లు బ్లాక్ చేసి మరీ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తున్నారు. కాగా, గుంటూరు కారం సినిమాను డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించారు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.

Also Read..

గుంటూరు కారం‌ ఎఫెక్ట్.. ఇండస్ట్రీకి శ్రీలీలనే దరిద్రం.. ఫిల్మ్ నగర్‌లో ఘోరంగా ట్రోల్స్!

Advertisement

Next Story