మహేష్ బాబు-సౌందర్య కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ చిత్రమిదే?

by Anjali |   ( Updated:2023-11-05 11:18:48.0  )
మహేష్ బాబు-సౌందర్య కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ చిత్రమిదే?
X

దిశ, వెబ్‌డెస్క్: దివంగత హీరోయిన్ ‘సౌందర్య’ గురించి సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను అలరించింది. సౌందర్య అందం, నటన, డాన్స్‌ను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం భాషల్లో మొత్తం 100కు పైగా సినిమాల్లో నటించింది. 12 ఏళ్లు స్టార్ నటిగా టాలీవుడ్ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన సౌందర్య ఎవరూ ఊహించని విధంగా వెండితెరకు దూరమైంది. రాజకీయాల్లో ఓ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు వెళ్లి.. 2004లో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది. దీంతో సౌందర్య అభిమానులు, ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలు, తన కుటుంబీకులు ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇదంతా పక్కన పెడితే..

తాజాగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు-సౌందర్య కాంబినేషన్‌లో ఓ సూపర్ హిట్ సినిమా మిస్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అయితే, మహేష్ బాబు నటించిన ‘యువరాజు’ చిత్రంలో దర్శక, నిర్మాతలు సిమ్రాన్, సాక్షి శివానంద్‌లను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. కాగా, తొలుత సిమ్రాన్ రోల్ కోసం సౌందర్యను అనుకున్నారట. కానీ సౌందర్య మహేష్ బాబు కంటే వయసులో పెద్ద కాబట్టి వీరి జోడి కుదరలేదట.

అయితే మహేష్ తో సినిమా అనగానే సౌందర్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందట. కానీ ఫోటో షూట్ చేసిన తర్వాత ఎందుకో కెమిస్ట్రీ కుదరడం లేదు, ఏ యాంగిల్‌లో చూసిన సూపర్ స్టార్‌కు అక్కలాగానే ఉన్నానని స్వయంగా సౌందర్యనే డైరెక్టర్ వై వీ ఎస్ చౌదరికి చెప్పిందట. దీంతో ఈ మూవీ నాకంటే సిమ్రాన్‌కే పర్ఫెక్ట్‌గా ఉంటుంది, ఆమెను సంప్రదించి.. కథ వినిపించండి అని సౌందర్యనే సలహా ఇచ్చిందట.

Advertisement

Next Story