నాని ‘హాయ్ నాన్న’ సాంగ్ రిలీజ్ చేసిన మహేష్ బాబు.. ఆసక్తికర ట్వీట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-10-06 07:12:30.0  )
నాని ‘హాయ్ నాన్న’ సాంగ్ రిలీజ్ చేసిన మహేష్ బాబు.. ఆసక్తికర ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో నాని, మృణాల్ ఠాకూర్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. దీనిని కొత్త డైరెక్టర్ శౌర్యువ్ రూపొందిస్తున్నాడు. ఈ మూవీ ఫాదర్, డాటర్ సెంటిమెంట్‌తో రాబోతుంది. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, హాయ్ నాన్న నుంచి సెకండ్ సింగిల్‌ని సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. ప్రతి కూతురు కోసం నాన్న పాట అంటూ ‘గాజు బొమ్మ’ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇక నానికి కూతురిగా ‘బేబీ కియారా’ నటిస్తుంది. ఈ సినిమాకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

Next Story