- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్క లిప్‌లాక్‌కు కోటి రూపాయలు డిమాండ్ చేసిన హీరోయిన్ !
దిశ, సినిమా : బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఒకప్పుడు మాధురీ దీక్షిత్ ఒకరు. ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తన అందంతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా నెట్ ఫ్లిక్స్‌లో 'ది ఫేమ్ గేమ్' ను ప్రమోట్ చేస్తోంది. ఈ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా మాధురికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. 1988లో సూపర్ హిట్ అయిన "దయా వాన్" సినిమాలో వినోద్ ఖన్నా.. మాధురి దీక్షిత్ జంటగా నటించారు. ఇందులో హీరో హీరోయిన్ మధ్య ఓ లిప్ లాక్ సీన్ ఉంటుంది. అప్పట్లో ఈ సీన్‌పై బాగా చర్చ జరిగింది. అంతగా ఫేమ్ ఉన్న నటి ఎందుకలా చేసిందంటూ ప్రశ్నలు తలెత్తాయి. అయితే తాజా సిరీస్ ప్రమోషన్‌లో కూడా మాధురికి మరోసారి సేమ్ క్వశ్చన్ ఎదురైంది. దీనిపై స్పందించిన ఆమె ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. "నేను ఆ సన్నివేశంలో నటించకుండా ఉండాల్సింది. మూవీలో ఆ సీన్ ఇంపార్టెంట్ కానప్పటికీ పెట్టారని అనిపించింది. నేను దానికి నో చెప్పి ఉండాల్సింది కానీ అలా జరగలేదు" అని చెప్పుకొచ్చింది. అయితే ఈ సీన్‌తో పాటు, మూవీలో నటించేందుకు మాధురీ దీక్షిత్‌కు అప్పట్లోనే కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారట. అందుకే ఆమె నో చెప్పలేకపోయింది అంటున్నాయి సినీ వర్గాలు.
ఇవి కూడా చదవండి : స్వీట్ అండ్ వైల్డ్‌గా 'Leo' గ్లింప్స్