షారుఖ్ ఖాన్ దేవుడి లాంటివాడు.. అందుకే నా ఫస్ట్ క్రష్

by sudharani |   ( Updated:2023-04-24 11:49:30.0  )
షారుఖ్ ఖాన్ దేవుడి లాంటివాడు.. అందుకే నా ఫస్ట్ క్రష్
X

దిశ, సినిమా : షారుఖ్ ఖాన్ వ్యక్తత్వంపై నటి మధు షా ప్రశంసలు కురిపించింది. తాను చూసిన అత్యంత ప్రతిభావంతుల్లో షారుఖ్ ఒకరన్న ఆమె.. ఆయన నటన, నైపుణ్యం, పనిచేసే తీరు తనను మంత్రముగ్దురాలిని చేసినట్లు పేర్కొంది. అంతేకాదు ఎవరైనా తమ క్రష్ గురించి మాట్లాడితే తనకు మొదట బాద్‌షానే గుర్తొస్తాడన్న నటి.. ‘ఆయనన ఇంటెలిజెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ నన్ను ఎన్నోసార్లు అట్రాక్ట్ చేసింది. నేను ఆయనకు పెద్ద అభిమానిని. ఆయన సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఎన్నడూ దారుణంగా విఫలం కాలేదు. షారుఖ్ ఎల్లప్పుడూ కష్టపడటమే కాదు.. అందరి కంటే భయంకరంగా పని చేస్తాడు. అతను దేవుడిలాంటివాడు’ అంటూ తనదైన స్టైల్‌లో పొగిడేసింది.

Also Read: జీన్స్‌లో అదిరిపోయే ఫోటోలకు ఫోజులిచ్చిన రానా సతీమణి

Advertisement

Next Story

Most Viewed