జైలు నుంచి స్టార్ హీరోయిన్ కి ప్రేమలేఖ.. వంద మందికి ఐఫోన్ 15ప్రో ఇవ్వనున్న ఆ ప్రేమికుడు

by Prasanna |
జైలు నుంచి స్టార్ హీరోయిన్ కి  ప్రేమలేఖ.. వంద మందికి ఐఫోన్ 15ప్రో ఇవ్వనున్న ఆ ప్రేమికుడు
X

దిశ,సినిమా: లవ్ లెటర్స్ ఒకప్పుడు ట్రెండింగ్లో ఉండేవి కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ఆ రోజులు పోయాయి. కానీ, జైలులో ఉన్న ఓ వ్యక్తి తన ప్రేయసి కోసం లవ్ లెటర్ రాసాడు. ఆ కథ ఏంటో ఇక్కడ చూద్దాం..

సుకేష్ చంద్రశేఖర్ బాలీవుడ్ నటి జాక్వెలిన్‌కు మరోసారి ప్రేమలేఖ రాశాడు. జాక్వెలిన్‌కి సుకేష్ ఇంతకు ముందు కూడా ప్రేమ లేఖలు పంపిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 11న జాక్వెలిన్ బర్త్డే సందర్భంగా 100 మందికి ఐఫోన్ 15 ప్రోను గిఫ్ట్ గా ఇస్తున్నట్లు ప్రకటించిన సుకేష్.. తాజాగా ఈ ముద్దుగుమ్మ కొత్త సాంగ్ "యిమ్మీ యిమ్మీ" పాట సూపర్ అని లేఖ ద్వారా ప్రశంసించాడు

ఈ లేఖను సుకేష్ తన లాయర్ ద్వారా మీడియాకు అందించారు. ఈ పాట నాకు బాగా నచ్చింది, నా సంతోషం కోసం 100 మందికి ఐఫోన్ 15 ప్రోను అందజేస్తానని చెప్పాడు. సుకేష్ కు రాసిన ఈ లేఖలో ఆమె అందంపై కవితలు కూడా రాసాడు. ఈ పాటను వంద మిలియన్లకు పైగా వీక్షించారని లేఖలో తెలిపారు. బాలీవుడ్‌కి అసలైన రాణి జాక్వెలిన్ అంటూ లేఖలో రాసుకొచ్చాడు. ఈ కేసులో ఈమెను కూడా నిందితురాలిగా గుర్తించగ.. ఇంకా అరెస్టు చేయకపోవడం వెనుక ఏ కారణం ఉందో.. సుకేశ్‌ నుంచి నగలు,విలువైన వస్తువులను తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే,ఈమె వీటినన్నింటిని ఖండించింది, సుకేశ్‌ తనను దారుణంగా చీట్ చేసినట్లుగా తెలిపింది.

Advertisement

Next Story