21 సంవత్సరాల తర్వాత ఒకే స్టూడియోలో కలిసిన లెజెండరీ యాక్టర్స్

by sudharani |   ( Updated:2023-11-23 13:33:13.0  )
21 సంవత్సరాల తర్వాత ఒకే స్టూడియోలో కలిసిన లెజెండరీ యాక్టర్స్
X

దిశ, సినిమా: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తమదైన క్రేజ్, ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు లెజెండరీ యాక్టర్స్ సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. ఇక వీరికున్న ఫ్యాన్ ఫాలోయింగ్, మాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా వీరిద్దరు ఒకే స్టూడియోలో తమ సినిమాలకు సంబంధించిన షూటింగ్స్‌లో పాల్గొన్నారు. శంకర్ దర్శకత్వంలో కమల్ ‘ఇండియన్ 2’ షూటింగ్ చెన్నైలోని ప్రసాద్ స్టూడియో ఎరీనాలో జరుగుతుంది.

ఇక ఇక్కడే తలైవా హీరోగా జ్ఞానవేల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తలైవర్ 170’ చిత్రీకరణ కూడా మొదలైంది. అయితే తన షూటింగ్ స్పాట్‌కి సమీపంలోనే కమల్ ఉన్నాడని తెలుసుకున్న రజనీ.. తన మిత్రుడిని కలవటానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న లోకనాయకుడు ఆయనకన్నా ముందే షూటింగ్ స్పాట్‌కి వెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చాడట. ఇలా ఇద్దరు ఒకే స్టూడియోలో కలుసుకోవటం, షూటింగ్స్ జరుపుకోవటం జరిగి 21 సంవత్సరాలు అయిందట. మొత్తానికి ఒకరినొకరు కలుసుకుని గత స్మృతులను గుర్తుచేసుకున్నారు ఈ సూపర్ స్టార్స్.

Advertisement

Next Story