ఎమోషనల్ అయిన Lawrence.. నా దురదృష్టం అంటూ ఆ ఫొటో పోస్ట్..Krishnamraju

by sudharani |   ( Updated:2022-09-14 13:46:11.0  )
ఎమోషనల్ అయిన  Lawrence.. నా దురదృష్టం అంటూ ఆ ఫొటో పోస్ట్..Krishnamraju
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నటుడు కృష్ణంరాజు మృతిని సినీ ప్రముఖులు, అభిమానులు, రాజకీయవేత్తలు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన మరణం పట్లు టాలీవుడ్ స్టార్స్, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. కృష్ణం రాజు మరణవార్తపై స్పందించిన నటుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

''రెబల్ స్టార్ కృష్ణంరాజు గారిని మిస్ అవుతున్నాను. సెట్‌లో అందరినీ తన సొంత బిడ్డలా చూసుకుంటారు. ఎవరన్న భోజనం చేయకపోతే.. ఓ తల్లిలా అందరికి భోజనం వడ్డించేవారు. సెట్‌లో అందరిని చాలా కేర్‌గా చూసుకునేవారు. ఇప్పుడు నేను ఆ ప్రేమను, సంరక్షణను చాలా మిస్ అవుతాను. నా దురదృష్టం, నేను అవుట్ ఆఫ్ స్టేషన్‌లో ఉండటం వల్ల.. ఆయనను కడసారి చూసుకోలేక పోయాను. అతని వారసత్వం ఎప్పుడూ ప్రభాస్ ద్వారానే ఉంటుంది'' అంటూ ప్రభాస్, కృష్ణంరాజు, లారెన్స్ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ చాలా ఎమోషనల్ అయ్యారు.

God Father Update 'తార్ మార్ తక్కర్ మార్' అంటూ స్టెప్పులేసిన చిరంజీవి, సల్మాన్

Advertisement

Next Story