Lavanya Tripathi: టాప్ సీక్రెట్ రివీల్ చేసిన లావణ్య త్రిపాఠి.. నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్

by Hamsa |
Lavanya Tripathi: టాప్ సీక్రెట్ రివీల్ చేసిన లావణ్య త్రిపాఠి.. నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత పలు హిట్ మూవీస్ చేసి ప్రేక్షకులను అలరించింది. ఇక వరుణ్ తేజ్‌‌తో మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించి ప్రేమలో పడింది. అయితే ఈ జంట తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు. కానీ లావణ్య మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. పెళ్లి తర్వాత ఈ అమ్మడు ‘మిస్ ఫర్‌ఫెక్ట్’ అనే సిరీస్‌లో నటించింది. ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఆ తర్వాత నుంచి లావణ్య ఏ కొత్త మూవీ ప్రకటించలేదు. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. అప్పుడప్పుడు వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేయడంతో పాటు అభిమానులతో ముచ్చటిస్తోంది. తాజాగా, లావణ్య తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా టాప్ సీక్రెట్ రివీల్ చేసింది. ‘‘మీ ఫ్యామిలీకి సంబంధించిన రహస్య ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు అది వండర్‌ఫుల్‌గా పని చేస్తుంది. ఒకేసారి మీ టాన్‌ను తొలగించి చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. టాప్ సీక్రెట్’’ అనే క్యాప్షన్‌ను జత చేసింది. ఈ పోస్ట్ ద్వారా మెగా కోడలు హోమ్ రెమిడీస్ అద్భుతంగా పని చేస్తాయని చెప్పింది. అలాగే కొన్ని ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలు కూడా ఇన్‌స్టాలో పెట్టింది.

Next Story