- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన లావణ్య త్రిపాఠీ.. మెగా హీరోతోనేనా?
దిశ, వెబ్‌డెస్క్ : అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠీ. ఇక ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ అమ్మడుకు సక్సెస్ లేటుగానే వచ్చిందని చెప్పవచ్చు.
ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి లావణ్య పెళ్లి. లావణ్య త్రిపాఠీ ఓ మెగా హీరోతో లవ్‌లో ఉందంటూ ఓ పుకారు నెట్టింట్లో తెగ షికారు చేస్తోంది.
అయితే తాజాగా ఈ అమ్మడు, ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. మీరు పదే పదే నా పెళ్లి గురించే ప్రస్తావిస్తున్నారు.పెళ్లి గురించి చెప్పాల్సిన టైం వస్తే నేనే మీకు చెబుతాను. అయినా నేను చాలా అదృష్టవంతురాలిని నన్ను మా పేరేంట్స్ పెళ్లి చేసుకొమ్మని ఇబ్బంది పెట్టడం లేదు. అయినా నేను పెళ్లి చేసుకుంటాను. అది ఎప్పుడంటే, నాకు నచ్చిన వ్యక్తి కలిసి, అతని పట్ల నాకు ప్రేమ మొదలైంతే తప్పకుండా నేను పెళ్లి చేసుకుంటాను.కానీ ఇంకా నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరకలేదు. దొరికితే మాత్రం మీకు పరిచయం చేస్తానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం లావణ్య త్రిపాఠీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే మరికొందరు, లావణ్య వరుణ్ తేజను ఉద్దేశించే ఇలాంటి వాఖ్యలు చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: పెళ్లై నెలరోజులు కాకుండానే కియారాకు కఠినమైన కండీషన్స్ పెట్టి షాకిచ్చిన సిద్ధార్థ్?