పెళ్లి చీరతో ప్రేమను వ్యక్త పరిచిన లావణ్య.. మెగా కోడలిపై నెట్టింట ప్రశంసలు

by sudharani |   ( Updated:2023-11-04 08:54:13.0  )
పెళ్లి చీరతో ప్రేమను వ్యక్త పరిచిన లావణ్య.. మెగా కోడలిపై నెట్టింట ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.. ఇప్పుడు మెగా ఇంటి కోడలు అయిపోయిన విషయం తెలిసిందే. మెగా కుటుంబసభ్యులు, బంధువులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వరుణ్, లావణ్య మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే.. వివాహం సందర్భంగా లావణ్య కట్టుకున్న కాంచీపురం చీరకు ఓ ప్రత్యేకత ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అదేంటి అనుకుంటున్నారా..

ఎరుపు రంగు, గోల్డ్ కలర్ బార్డర్ కాంచీపురం చీరలో లావణ్య మరింత అందంగా మెరిసింది. అయితే.. ఈ చీరను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది. ఆ చీరపై తెలుగులో ‘వరుణ్‌లావ్’ అని రాయించడమే కాకుండా పేరు పక్కన ఇన్ఫినిటీ సింబల్ కూడా వేయించారు. అంటే తమ ప్రేమ అనంతమన్న ఉద్దేవంతో పెళ్లి చీరపై అలా రాయించడం చూసిన అభిమానులు మురిసిపోతున్నారు. కాగా.. ఇటలీలో వీరి వివాహం జరగడంతో 5 వ తేదీన (ఆదివారం) హైదరాబాద్ మాదాపూర్‌లో ఎన్‌కన్వెన్షన్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ జరగనుంది.

Read More..

వరుణ్ పెళ్లిలో ఘోరంగా హర్ట్ అయిన ఉపాసన..

Advertisement

Next Story