- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చనిపోయే ముందు మహేశ్ బాబు గురించి చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు...
దిశ, వెబ్ డెస్క్: సినిమా హీరో కృష్ణ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే, అతను ఇటీవలే ఓ చానెల్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి, అదేవిధంగా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి, తన అభిమానుల గురించి అందులో చెప్పుకొచ్చారు. 76 సంవత్సరాల వరకు తాను యాక్టింగ్ చేశానని, ఆ తర్వాత ఆరోగ్యం సహకరించక యాక్టింగ్ మానేశాని చెప్పారు. అయితే, తన కెరియర్ లో 50 సంవత్సరాల పాటు 360 సినిమాలు చేశానని చెప్పారు.
ఫ్యామిలీ విషయానికొస్తే.. తనకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తన కొడుకు నరేష్ కే చెబుతానని, అతనికి చెప్పిన వెంటనే దానిని నిమిషాల్లో పూర్తి చేస్తాడని, తనని నరేష్ ఎంతగానో అభిమానిస్తాడని చెప్పాడు. అదేవిధంగా తన సతీమణి మరణం తర్వాత తాను లోన్లీగా ఫీలవుతున్నాను అని చెప్పాడు. మరో విషయమేమంటే... మహేశ్ బాబు తన కెరియర్ లో ఆల్మోస్ట్ నెంబర్ వన్ స్టార్ గా ఎదుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. అదేవిధంగా తన చిన్న కూతురు ఇద్దరు కొడుకులు అందంగా ఉంటారని, వారు ఖచ్చితంగా భవిష్యత్తులో సినిమా రంగంలోకి వచ్చి, రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. అదేవిధంగా తాను సినిమాలు తీయకపోయినా తన అభిమానులు ఇంకా తనని ఎంతోగానో అభిమానిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.