రెండోసారి బ్రేకప్‌కు సిద్ధమైన స్టార్ ప్రేమికులు.. పిల్లల పరిస్థితేంటి?

by sudharani |
రెండోసారి బ్రేకప్‌కు సిద్ధమైన స్టార్ ప్రేమికులు.. పిల్లల పరిస్థితేంటి?
X

దిశ, సినిమా : సోషల్ మీడియా పర్సనాలిటీ కైలీ జెన్నర్ ప్రియుడు ట్రావిస్ స్కాట్‌తో రెండోసారి విడిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు ప్రేయసితో కలిసి గడపాలని ట్రావిస్ భావించినప్పటికీ ఆమె తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పెన్‌కు వెళ్లడం ఈ చర్చకు దారితీసింది. అయితే 2017లో డేటింగ్ ప్రారంభించిన ఈ జోడి ఏడాదిలోపే 2018లో మొదటిబిడ్డను స్వాగతించారు. ఆ తర్వాత కొంతకాలం విడివిడిగా ఉంటూ మళ్లీ 2020లో కలిశారు. ఈ క్రమంలోనే 2022 ఫిబ్రవరిలో రెండో బిడ్డను స్వాగతించిన స్టార్ కపుల్స్ ప్రస్తుతం రెండవసారి తమ సంబంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా జెన్నర్ భావోద్వేగ పోస్ట్ షేర్ చేస్తూ.. ఒత్తిడిని తట్టుకోవడానికి కొత్త సంబంధాలను సిద్ధం చేసుకోవాలని చెప్పడం ఈ పుకార్లకు దారితీసింది.

Advertisement

Next Story