విడాకులు తీసుకున్న నటి.. స్టేట్‌మెంట్ ఇవ్వాలని లేదంటూ రియాక్షన్..

by sudharani |   ( Updated:2023-07-12 12:40:13.0  )
విడాకులు తీసుకున్న నటి.. స్టేట్‌మెంట్ ఇవ్వాలని లేదంటూ రియాక్షన్..
X

దిశ, సినిమా: ఇండియన్ యాక్ట్రెస్ అండ్ సోషల్ మీడియా పర్సనాలిటీ కుషా కపిల.. తనపై నెట్టింట వస్తున్న ట్రోలింగ్‌పై తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయింది. 2017లో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త జోరావర్ అహ్లువాలియాతో ఇటీవలే విడిపోతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ విషయం తెలియగానే షాక్ అయిన నెటిజన్స్.. ఆరేళ్లు బాగా వాడుకుని వదిలేసిందంటూ ఆమెను దారుణంగా విమర్శిస్తున్నారు. జోరావర్ అమాయకుడని, అందుకే ఈజీగా మోసం చేసిందంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో తాజాగా స్పందించిన నటి..‘ఈ అంశం అధికారికంగా ముగిసింది. నేను ఎవరికీ స్టేట్‌మెంట్ ఇవ్వదలుచుకోలేదు, ఎప్పటికీ ఇవ్వను. ఎందుకంటే అందరిలా నాకు పీఆర్ టీమ్ లేదు. సో నో స్టోరీ ఈజ్ ఏ ప్లాంట్’ అంటూ ట్రోలర్స్‌కు చురకలంటించింది. చివరగా తాము వివాహమైన ఆరు సంవత్సరాల తర్వాత విడిపోయామని, ఆరు నెలలకు కాదంటూ స్పష్టం చేసింది.

Read More: Divyansha Kaushik : సమంత వల్ల ఆ హీరోయిన్ కెరీర్ నాశనమైందా?

Advertisement

Next Story