Super Star Krishna :ఆ కోరికలు తీరకుండానే మరణించిన కృష్ణ..

by sudharani |   ( Updated:2022-11-15 06:52:45.0  )
Super Star Krishna :ఆ కోరికలు తీరకుండానే మరణించిన కృష్ణ..
X

దిశ, వెబ్‌డెస్క్: గుండెపోటుతో సూపర్ స్టార్ కృష్ణ సోమవారం ఆసుపత్రిలో చేరగా.. చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. కృష్ణ కుటుంబ సభ్యులు ధైరంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ కోరుకున్న నాలుగు కోర్కెలు తీరకుండానే మరణించారు. అవేంటంటే

మహేశ్ బాబుతో ఆ కల నెరవేరలే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో జేమ్స్ బాండ్ తరహాలో గూఢచారి పాత్రను పరిచయం చేసింది సూపర్ స్టార్ కృష్ణనే. దీంతో ఆయనకు ఆంధ్రా జేమ్స్ బాండ్ అనే పేరు కూడా వచ్చింది. ఆయన తరహాలోనే మహేశ్ బాబును కూడా జేమ్స్ బాండ్‌గా చూడాలనుకున్నారు. కానీ అలాంటి పాత్రలకు మహేశ్ బాబు వ్యతిరేకం కావడంతో ఆ కోరిక తీరకుండానే మరణించారు.

మనవడితో సినిమా..

సూపర్ స్టార్ కృష్ణ తన కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబులతో పలు చిత్రాల్లో నటించారు. ఇప్పుడు మనవడు గౌతమ్ కృష్ణ కూడా ''వన్ నేనొక్కడినే'' సినిమాతో ఇండ్రస్ట్రీలో అడుగు పెట్టాడు. దీంతో మనవడితో కలిసి నటించాలని చాలా సందర్భాల్లో ఆయన తన కోరికను బయటపెట్టారు. కానీ ఆ కోరిక కూడా తీరలేదు.

'కౌన్ బనేగా కరోడ్ పతి' లాంటి టీవీ షోలు..

అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించిన 'కౌన్ బనేగా కరోడ్ పతి' షో ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే. హిందీలో ఈ షో హిట్ కావడంతో తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ షోను స్టార్ట్ చేశారు. అయితే అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షో చూసిన కృష్ణ తెలుగు తెరపై ఇలాంటి షోలు వస్తే నేను చేయడానికి రెడీగా ఉన్నానని చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే తెలుగులో ''మీలో ఎవరు కోటీశ్వరుడు'' షో స్టార్ట్ చేసే సమయానికి ఆయనకు నటనకు దూరం కావడంతో.. ఆ కోరిక కూడా కలగానే మిగిలిపోయింది.

ఛత్రపతి శివాజీ సినిమాల్లో నటించాలనుకున్నారు

తెలుగు ప్రేక్షకులకు అల్లురి సీతారామ రాజు పాత్ర అనగానే గుర్తువచ్చే పేరు సూపర్ కృష్ణ. అంతలా ఆ పాత్రకు జీవం పోశారు ఆయన. అయితే ఈ పాత్ర తర్వాత అతిగా ఇష్టపడిన మరో పాత్ర ఛత్రపతి శివాజీ. కృష్ణ ఓ సినిమాలో శివాజీ పాత్ర చేసినప్పటికీ అది పూర్తి స్థాయి కాదు. శివాజీ పాత్ర అంటే కృష్ణకు చాలా ఇష్టం కావడంతో పూర్తి స్థాయిలో శివాజీ పాత్ర చేయాలనుకున్నారు. ఆ పాత్ర ఆధారంగా ఓ సినిమా తీసినప్పటికీ అది మత ఘర్షణలు చెలరెగుతాయేమోననే సందేహంతో దాన్ని మధ్యలో వదిలేశారు. దాంతో తనకు ఇష్టమైన శివాజీ పాత్రలో వెండితెరపై పూర్తిస్థాయిలో కనిపించాలనే కోరిక తీరకుండా పోయింది.

ఇవి కూడా చదవండి:

Super Star Krishna: కృష్ణ కుటుంబానికి పవన్ కల్యాణ్ సంతాపం..

Super Star Krishna: మహేశ్ అన్నా.. నీకే ఎందుకు ఇన్ని బాధలు?

Advertisement

Next Story

Most Viewed