పది గ్రామాలకు కొణిదెల నిహారిక వరద సాయం.. ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్

by Gantepaka Srikanth |
పది గ్రామాలకు కొణిదెల నిహారిక వరద సాయం.. ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ కొనిదెల నిహారిక గొప్ప మనసు చాటుకున్నారు. విజయవాడ వరద బాధితులకు సాయం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా(ఇన్‌స్టాగ్రామ్) వేదికగా ప్రకటించారు. ‘బుడవేరు వాగు ముంపుతో విజయవాడ రూరల్ ఏరియాలో అనేక గ్రామాలు నీట మునగడం, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండటం నాకు చాలా బాధ కలిగించింది. ఇటువంటి ప్రకృతి విపత్తులో ఎక్కువగా ఇబ్బందులు పడేది కేవలం గ్రామీణ ప్రాంత ప్రజలే. నేను పుట్టిన పెరిగిన వాతావరణం అంతా నగరంలోనే అయినా కూడా మా పెద్దవారు అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారే కాబట్టి వారు చెప్పే అనుభవాలు విన్న దృష్ట్యా నాకు గ్రామీణ వాతావరణంపై ఎంతో అభిమానం ఉంది.

ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మా బాబాయ్ పవన్ కల్యాణ్‌ గారితో పాటు మా కుటుంబీకులంతా బాధితులకు అండగా ఉండటం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. నేను కూడా ఈ బృహత్కార్యంలో పాటు పంచుకోవాలనే ఉద్దేశంతో ఉడతా భక్తిగా వరద ముంపునకు గురైన ఒక పది గ్రామాలకు రూ.50 వేల చొప్పున రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను’ కొణిదెల నిహారిక సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

Advertisement

Next Story