Parliament సభ్యుల కోసం ఆ సినిమా స్పెషల్ షో!

by GSrikanth |
Parliament సభ్యుల కోసం ఆ సినిమా స్పెషల్ షో!
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్వాతంత్ర్యం కోసం పోరాడి వారి ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన మహనీయుల్లో 'ఖుదీరామ్ బోస్' ఒకరు. ఖుదీరామ్ బోస్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన సినిమా 'ఖుదీరామ్ బోస్'. మరుగున పడిపోయిన ఆయన జీవితం గురించి ప్రపంచానికి తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జాగర్లమూడి పార్వతి సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రజితా విజయ్ జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమాకు డీవీఎస్ రాజు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న ఈ సినిమాను ఇటీవల గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించగా చాలా మంచి స్పందన వచ్చింది.

విశేషం ఏంటంటే ఈరోజు(22-12-2022) సాయంత్రం 'ఖుదీరామ్ బోస్‌' చిత్రాన్ని పార్లమెంట్‌ సభ్యులకు ప్రదర్శించబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. న్యూఢిల్లీ మహాదేవ్ రోడ్డులోని ఫిల్మ్స్ డివిజన్ ఆడిటోరియంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఫిల్మ్స్ డివిజన్‌ అన్ని ఏర్పాట్లు చేయాల్సిందని మినిస్టరీ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ తరఫున ప్రభుత్వ సెక్రటరీ సురజిత్‌ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందించగా, జాతీయ అవార్డు విజేత తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు. స్టంట్ డైరెక్టర్‌గా కనల్ కణ్ణన్, సినిమాటోగ్రాఫర్‌గా రూసూల్ ఎల్లోర్, ఎడిటర్‌గా మార్తాండ్ కె. వెంకటేశ్, రైటర్‌గా బాలాదిత్య వ్యవహరించారు.

Also Read..

కరోనా ఎఫెక్ట్: నేడు ప్రధాని అధ్యక్షతన అత్యున్నత సమావేశం

Advertisement

Next Story

Most Viewed