'ఖైదీ' రీమేక్ 'భోలా' టీజర్ రిలీజ్.. సర్‌ప్రైజ్ చేసిన సీనియర్ హీరో

by Hajipasha |   ( Updated:2022-11-22 12:49:11.0  )
ఖైదీ రీమేక్ భోలా టీజర్ రిలీజ్.. సర్‌ప్రైజ్ చేసిన సీనియర్ హీరో
X

దిశ, సినిమా: ఒక మంచి హిట్ మూవీని రీమేక్ చేయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, ఏమాత్రం బెరుకు లేకుండా ఈ చాన్స్ తీసుకుంటున్న బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌ దేవగన్ రీమేక్ మూవీలతో హిట్స్ అందుకుంటున్నాడు. రీసెంట్‌గా ఆయన నటించిన 'దృశ్యం 2' మంచి సక్సెస్ సాధించింది. ఇక ఇప్పుడు మరో‌ రీమేక్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన 'ఖైదీ' మూవీని, హిందీలో 'భోలా' పేరుతో అజయ్ దేవగన్ రీమేక్ చెస్తున్నాడు. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. 90 సెకన్ల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ మొదటి సీన్ తప్పించి.. మిగతా సన్నివేశాలన్నీ అసలు ఇది 'ఖైదీ' మూవీనేనా? అనే సందేహం కలిగిస్తున్నాయి. మొత్తానికి 'దృశ్యం 2' మూవీ కథలో చిన్న చిన్న మార్పులు చేసి హిట్ కొట్టినట్టిన ఈ సీనియర్ హీరో.. ఈ మూవీలో కూడా ఏమైనా మార్పులు చేశారేమో చూడాలి మరి.

Advertisement

Next Story