అన్నదమ్ములు ఇద్దరూ ఒక్కటే.. అంటూ మెగా హీరో పై వైరల్ కామెంట్స్ చేసిన కేతిక శర్మ..!

by Kavitha |   ( Updated:2024-01-17 07:55:34.0  )
అన్నదమ్ములు ఇద్దరూ ఒక్కటే.. అంటూ మెగా హీరో పై వైరల్ కామెంట్స్ చేసిన కేతిక శర్మ..!
X

దిశ, సినిమా: మెగా కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి వారి సత్తా చాటుతున్నారు. ఈ హీరోలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. ‘రేయ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సాయి ధరమ్ తేజ్ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’, ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజూ పండగే’ వంటి హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక మూవీస్ అని కాకుండా ధరమ్ తేజ్ వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి . ఇక ఆయనతో కలిసి పని చేసినటువంటి సెలబ్రిటీలను కనుక మనం ప్రశ్నిస్తే సాయి తేజ్ గురించి ఏదో ఒక ట్యాగ్ ఇస్తూ ఉంటారు. అయితే హీరోయిన్ కేతిక శర్మ ధరమ్ తేజ్ తో మాత్రమే కాకుండా వైష్ణవ్ తేజ్ తో కలిసి నటించిన విషయం మనకు తెలిసిందే.

ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఈ ఇద్దరు హీరోల గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘ వైష్ణవ్ తో నేను చాలా సరదాగా ఉండేదాని. ఇద్దరం చిన్నపిల్లలు మాదిరి కొట్టుకునే వాళ్ళం. ఇక ధరమ్ తేజ్ కూడా చాలా సరదాగా ఉంటాడు. కానీ ఒక మాటలో చెప్పాలి అంటే ఇద్దరిలో సాయి తేజ్ హస్బెండ్ మెటీరియల్’ అంటూ కేతిక కామెంట్ చేసింది .ఇక వీరిద్దరూ కూడా చాలా స్వీట్ అని ఆమె తెలిపింది. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో నటి లావణ్య త్రిపాఠి కూడా ఒక ఇంటర్వ్యూలో ‘వరుణ్ తేజ్ హస్బెండ్ మెటీరియల్ కానీ సాయి తేజ్ పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్’ అంటూ కామెంట్స్ చేసింది. మొత్తానికి అయితే ధరమ్ తేజ్ లో ఒక గుడ్ హస్బెండ్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అని తనలో ఉన్నట్లు తెలుస్తోంది.


Advertisement

Next Story