అందులో స్లోనా ఫాస్టా? బాగా పెట్టావంటారా.. కీరవాణి కొడుకును పచ్చిగా అడిగిన స్టార్ యాంకర్

by Anjali |   ( Updated:2024-04-25 11:18:40.0  )
అందులో స్లోనా ఫాస్టా? బాగా పెట్టావంటారా.. కీరవాణి కొడుకును పచ్చిగా అడిగిన స్టార్ యాంకర్
X

దిశ, వెబ్‌డెస్క్: చైల్డ్ ఆర్టిస్టుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి. తర్వాత ‘మత్తు వదలరా’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో.. వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి. తిరిగి ఓ మంచి మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు శ్రీసింహా ప్రయత్నిస్తున్నాడు. ఇకపోతే రీతూ చౌదరి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న దావత్ షోకు శ్రీసింహా హాజయ్యాడు. చిలిపి ప్రశ్నలతో ఈ హీరోకు రీతూ చుక్కలు చూపించింది. పచ్చిగా డబుల్ మీనింగ్ క్వశ్చన్స్ వేసింది. ‘మీ ఇంట్లో డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, హీరో ఇలా అందరున్నారు? ఇలా ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించగా.. మేము పేకాట ఆడినట్లు ఇవన్నీ పంచుకోలేదు’ అంటూ శ్రీసింహా ఫన్నీగా ఆన్సర్ ఇస్తాడు.

అలాగే ఫ్యామిలీ అంతా కలిసి మీ మూవీ చూస్తుంటే మీరు హీరోయిన్‌కు లిప్ లాక్ ఇస్తారు. అప్పుడు ఒక్కొక్కరి రియాక్షన్ ఎలా ఉంటుంది? లిప్ లాక్ పై మీ ఫ్యామిలీ ఏమైనా ప్రశ్నలు వేస్తారా?సింహా లిప్ లాక్ సీన్లు కావాలని నువ్వు అడిగావా? అని రాజమౌళి ప్రశ్నిస్తారా? అని రీతూ అడుగుతుంది. చ.. చ అలా అడగరు అంటాడు శ్రీసింహా. అయితే బాగా పెట్టావ్ అంటారా? అంటుంది రీతూ ఫన్నీగా. దీంతో అతడు సిగ్గుపడిపోతాడు. తర్వాత లిప్ లాక్ ఇచ్చే సన్నివేశానికి కీరవాణి సంగీతాన్ని అందించాలంటే ఎలా ఫీలావుతారని అంటుంది. మీరు ఏవోవో క్వశ్చన్స్ వేస్తున్నారు నాకు అర్థం కావడం లేదని హీరో తెలివిగా తప్పించుకుంటాడు. ఇక రీతూ చివర్లో పచ్చిగా డబుల్ మీనింగ్ ప్రశ్న అడుగుతుంది. సింహా నువ్వు స్లోనా? ఫాస్టా? అనగా.. ఎందులో అండి క్లారిటీగా అడగండి అంటాడు. ఎందోలోనో నీకు బాగా తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అంటుంది రీతూ. దీంతో శ్రీసింహా తలదించుకుని తెగ సిగ్గుపడిపోతాడు.

Advertisement

Next Story