Brahmamudi: మీరు నాతో ప్రేమగా ఉంటున్నట్లు నటించలేదా అంటూ రాజ్ ని నిలదీసిన కావ్య

by Prasanna |   ( Updated:2023-11-03 10:57:07.0  )
Brahmamudi: మీరు నాతో ప్రేమగా ఉంటున్నట్లు నటించలేదా అంటూ రాజ్ ని నిలదీసిన కావ్య
X

దిశ,వెబ్ డెస్క్: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

‘నువ్వు గొప్పదానిలా చూపించుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావ్.. కానీ అబద్దం చెప్పడం.. నిజం దాచిపెట్టడం రెండూ నా దృష్టిలో క్షమించరాని నేరాలే’అని రాజ్ అంటాడు. ‘నేను చేసింది నేరం అయితే.. మరి మీరు చేసిందేంటి? తాతయ్యగారి కోసం మీరు కూడా నేరం చేసారు కదా.. అని కావ్య అంటుంది కావ్య ఆ మాటకి దొరిపోయానుగా అంటూ ముఖం పెడతాడు.. అలాగే ‘మీరు నాతో ప్రేమగా ఉంటున్నట్లు నటించలేదా? ఆ విషయంలో నాకు, ఆయనకీ అబద్దాలు చెప్పలేదా.? అందరి ముందు నిజం దాచిపెట్టి.. నాటకాలు బూటకాలు మొదలుపెట్టడం.. అంతా తెలుసు.. మీరు ఆడుతుంది నాటకమని’అని కావ్య అంటుంది కావ్య. షాక్ అయిపోయి చూస్తుంటాడు రాజ్.

రాజ్ ఏమి మాట్లాడకుండా అలా నిలబడిపోయి చూస్తుంటాడు.. ‘ఏది నిజం అని నమ్మాలి? నాకోసం మీరు ఏదో మేలు చేశారని నమ్మాలా? అది మీ తాతయ్యగారి కోసం చేసారని నమ్మాలా? మీ ప్రేమ అబద్దం కాదా? మీరు పెట్టిన గడువు అబద్దం కదా?’ అని అంటుంది కావ్య. ‘హేయ్.. ఆపు ఇంక .. నేను నా వాళ్లకి ఎంత ప్రాధాన్యత ఇస్తానో నీకు బాగా తెలుసు’ అంటాడు రాజ్. ‘కుటుంబం మీ ఒక్కరికేనా ఉంది.. నాకు ఉంది.. నా పుట్టింటికి నష్టం జరిగే పని నేను ఎప్పటికి నేను చెయ్యలేను.. మా అక్క కడుపుతో ఉన్నట్లు నాటకం ఆడింది.. ఆ నాటకం నాకు తెలిసిన తర్వాత నేను నోరు మెదపలేదని మీ ఆరోపణ’ అంటుంది కావ్య .. అవును అని రాజ్ అంటాడు.

Advertisement

Next Story