పొడవుగా ఉన్న ఆడవాళ్లు దానికి పనికిరారా? బాధగా ఉందన్న నటి

by Prasanna |   ( Updated:2023-05-28 09:13:53.0  )
పొడవుగా ఉన్న ఆడవాళ్లు దానికి పనికిరారా? బాధగా ఉందన్న నటి
X

దిశ, సినిమా: టెలివిజన్ ఇండస్ట్రీనుంచి వెండితెరకు పరిచయమవుతున్న క్రమంలో ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఎమెషనల్ అయింది కరిష్మా తన్నా. ఈ మేరకు కమిట్‌మెంట్‌తో ఎన్నో కష్టాలు పడి సినిమా అవకాశాలు చేజిక్కించుకుంటున్న క్రమంలోనే కొంతమంది నిర్మాతలు అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి ఏ కారణం లేకుండా రిజెక్ట్ చేశారని చెప్పింది. అంతేకాదు తనపై నెగెటీవ్ కామెంట్స్ కూడా చేశారన్న నటి.. ‘నువ్వు చాలా పొడవుగా ఉన్నావు. టీవీ పాత్రలకే నీ గ్లామర్‌ కరెక్ట్‌గా సరిపోతుంది. అలాగే ప్రతిరోజూ టీవీలో కనిపిస్తావ్ కాబట్టి మేము నిన్ను తీసుకోలేము’ అంటూ ముఖం మీదే చెప్పేశారని వాపోయింది. అయితే టీవీ యాక్టర్ అనే కారణంతో తనను తిరస్కరించినప్పుడల్లా చాలా అవమానంగా ఫీల్ అవుతూ నిరుత్సాహానికి గురయ్యానని తెలిపింది.

Also Read..

‘ఫక్ యు పుతిన్’.. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌‌లో ఉక్రేనియన్ మోడల్ నిరసన

Advertisement

Next Story