- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డేటింగ్‌పై స్పందించిన కంగనా.. అతడికి పెళ్లైందంటూ బాంబ్ పేల్చిన ఫైర్ బ్రాండ్!
దిశ, సినిమా: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనదైన స్టైల్లో స్పందిస్తుంది. అంతేకాకుండా వివాదాస్పద పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది. అయితే ఇటీవల కంగనా ఓ వ్యక్తి చేయి పట్టుకుని సెలూన్ నుంచి బయటకు వచ్చిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అతనినే ఆమె పెళ్లి చేసుకోబోయే దంటూ రూమర్లు చక్కర్లు కొట్టాయి. దీనిపై కంగనా సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో నిజం లేదు అతను నా ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే జనవరి 22న జరిగిన అయోధ్య ప్రారంభోత్సవానికి కంగనా హాజరైంది.
ఈజ్ మై ట్రిప్ వ్యవస్థాపకుడు నిషాంత్ పిట్టితో ఫొటోకు పోజులిచ్చింది. దీంతో వాటిని చూసిన వారంతా అతనితో డేటింగ్‌లో ఉందని అందుకే ఫొటోలు తీసుకుందని వార్తలు వచ్చాయి. తాజాగా, డేటింగ్ వార్తలపై కంగనా స్పందించింది. ‘‘ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ కేవలం వదంతులు మాత్రమే. అతనికి ఇప్పటికే పెళ్లైంది. దయచేసి ఇలాంటి వార్తలు ఎవరు నమ్మవద్దు. నేను ఇంకో వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నది నిజమే.
సరైన సమయం వచ్చినప్పుడు అతని గురించి నేను చెబుతాను. ఒక వ్యక్తితో ఫొటో దిగినంత మాత్రాన ఇలా మాట్లాడడం సరైన పద్ధతి కాదు’’ అంటూ ఇన్‌స్టాస్టోరీలో రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే.. కంగనా ప్రస్తుతం ఎమర్జెన్సీ సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉంది. ఈ చిత్రం జూన్ 14న రిలీజ్ కానుంది. కాగా కంనగా ఏదో ఒక పోస్ట్ ద్వారా గత కొద్ది కాలంగా వార్తల్లో నిలుస్తూ సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల ఈ అమ్మడు చంద్రముఖి-2, తేజస్ వంటి మూవీస్‌తో అలరించింది. అలాగే తనకు సంబంధించిన ఫొటోలను నెట్టింట పోస్టులు పెడుతూ అభిమానులను దగ్గరగా ఉంటుంది.
- Tags
- kangana ranaut