కోహ్లీ కూతురితో డేటింగ్.. పేరెంట్స్‌ మూర్ఖులంటూ తిట్టిపోసిన కంగన

by Anjali |
కోహ్లీ కూతురితో డేటింగ్.. పేరెంట్స్‌ మూర్ఖులంటూ తిట్టిపోసిన కంగన
X

దిశ, సినిమా: వామికా కోహ్లీతో డేటింగ్ చేయడానికి విరాట్ కోహ్లీని అనుమతి కోరిన ఓ అబ్బాయిపై కంగనా రనౌత్ సీరియస్ అయింది. ఈ సంఘటనతో తాను కలత చెందినట్లు చెబుతూ ట్విట్టర్ వేదికగా తనదైన స్టైల్‌లో విరుచుకుపడింది. విషయానికొస్తే.. ఏప్రిల్ 17న జరిగిన చెన్నై-ఆర్‌సీబీ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ స్టేడియంలో దాదాపు ఓ ఐదేళ్లలోపు వయసున్న పిల్లవాడు ‘హాయ్ విరాట్ అంకుల్.. నేను వామికాను డేట్‌కు తీసుకెళ్లొచ్చా?!’ అనే ప్లకార్డు పట్టుకుని దర్శనమిచ్చాడు.

కాగా ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు నెట్టింట తెగ వైరల్ కావడంతో ఒక్కసారిగా కంగుతిన్న నెటిజన్లు, విరాట్ ఫ్యాన్స్‌.. సదరు అబ్బాయి తల్లిదండ్రులపై దారుణంగా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే స్పందించిన కంగన.. ‘ఈ వయసులో డేటింగ్ అంటే ఏమీటో తెలియని పిల్లలతో అసభ్యకరమైన పనులు చేయిస్తున్నారా? మూర్ఖులారా’ అంటూ ఫైర్ అయింది.

Advertisement

Next Story