అప్పుడే పుట్టిన బాబును ఎత్తుకొని మురిసిపోతున్న కంగనా రనౌత్.. పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-10-20 10:03:56.0  )
అప్పుడే పుట్టిన బాబును ఎత్తుకొని మురిసిపోతున్న కంగనా రనౌత్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ అమ్మడు త్వరలో ‘తేజస్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తుంది. ఏదో ఒక వివాదాస్పదమైన పోస్టుతో నిత్యం వార్తల్లో నిలుస్టుంటుంది.

తాజాగా, కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. తన అన్నయ్యకు పుట్టిన బాబును ఎత్తుకొని మురిసిపోయింది. కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ.. ‘‘ఈ రోజు ఈ పవిత్రమైన రోజున మా కుటుంబంలోకి ఓ కొత్త వ్యక్తి వచ్చాడు. నా సోదరుడు అక్షిత్ రనౌత్, అతని భార్య రితూ రనౌత్‌లు ఒక కొడుకు పుట్టాడు. ఈ అందమైన అబ్బాయి పేరు ‘అశ్వత్థామ రనౌత్’. మా కుటుంబంలోని కొత్త సభ్యుడిని మీరందరు ఆశీర్వదించండి. మేము మా అనంతమైన ఆనందాన్ని అందరితో పంచుకుంటున్నాము. ధన్యవాదాలు రనౌత్ కుటుంబం’’ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్టును చూసిన నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed