కమల్ హాసన్ 'కల్కి'కి భారీగా పెంచేసిన రెమ్యూనరేషన్.. చిన్న కేమియో కోసం అన్ని కోట్లా..?

by Prasanna |   ( Updated:2024-04-25 06:49:46.0  )
కమల్ హాసన్  కల్కికి భారీగా పెంచేసిన రెమ్యూనరేషన్.. చిన్న కేమియో కోసం అన్ని కోట్లా..?
X

దిశ, సినిమా: ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ "కల్కి 2898 AD". మే 9న థియేటర్లలోకి రావాల్సిన ఈ మూవీ పోస్ట్ ఫోన్ అయినా విషయం తెలిసిందే. మూవీ మేకర్స్ కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నారు. అయితే ఈ సినిమా గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు కమల్ హసన్ ఎంత పారితోషికం తీసుకున్నారనే వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది.

ఈ మూవీలో నటుడు కమల్ హసన్ అతిథి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ పాత్ర కోసం మేకర్స్ కమల్ హాసన్ కు రూ. 50 కోట్ల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది కాబట్టి, కమల్ హాసన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉందని మేకర్స్ భావించారు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కూడా చిన్న పాత్రలో కనిపించనున్నారు. ఇందుకు గాను ఆయనకు రూ. 10 కోట్లు ఇచ్చినట్లు సమాచారం.

ఈ మూవీలో ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణె, దిశా పటాని వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌లో ఉన్న క‌ల్కి, త్వ‌ర‌లోనే బై చెప్పనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా మొదలు కానున్నాయి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి సినిమాను విడుదల చేయాలన్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

Advertisement

Next Story