కమల్ హాసన్‌ మారిపోయాడు.. ‘క‌ల్కి 2898 ఏడీ’లో రోల్ ఏంటో తెలుసా?

by samatah |   ( Updated:2023-07-22 06:39:19.0  )

దిశ, సినిమా : ప్రభాస్ అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ మూవీ గ్లింప్స్‌ను అమెరికా శాన్‌డియాగా కామిక్ కాన్ ఈవెంట్‌లో శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ వేడుకకు ప్రభాస్‌తో పాటు కమల్‌ హాసన్‌, రానా, నాగ్ అశ్విన్‌, నిర్మాత అశ్వినీదత్‌ అటెండ్ అయ్యారు. ఇందులో భాగంగా కమల్ మాట్లాడుతూ.. తన పాత్ర గురించి క్లారిటీ ఇచ్చాడు ‘సినిమాలో నెగిటివ్ లేకపోతే పాజిటివ్ ఉండదు. సో.. ఆ నెగిటివ్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ మూవీలో విలన్ క్యారెక్టర్‌కు ఒప్పుకున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. తన కెరీర్ ప్రాంరభం నుంచి పాజిటివ్‌ పాత్రల్లోనే కనిపించిన కమల్, లేటెస్ట్‌గా నెగెటివ్ రోల్ చేస్తున్నందుకు తనకు హ్యాపీ‌గా ఉందంటున్నాడు. ఇక ఈ వీడియో‌ గ్లింప్స్‌ గురించి మట్లాడుకుంటే.. హాలీవుడ్ స్టాండ‌ర్స్‌‌లో ఉందంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశంస‌లు కురిపిస్తున్నారు.

Read more : Movie News & Gossips

Advertisement

Next Story