#Kalki2898AD : కల్కి రిలీజ్.. వైరల్ అవుతున్న డైరెక్టర్ చెప్పులు

by Sujitha Rachapalli |
#Kalki2898AD : కల్కి రిలీజ్.. వైరల్ అవుతున్న డైరెక్టర్ చెప్పులు
X

దిశ, సినిమా : ' Kalki 2898 AD ' ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. మూవీ రిలీజ్ అయిన ప్రతి థియేటర్ లో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అభిమానులు. మొత్తానికి మహాభారతంతో ప్రస్తుతం నెలకొన్న క్లైమేట్ చేంజ్ కు లింక్ యాడ్ చేస్తూ కల్కి రూపంలో బెస్ట్ మేసేజ్ ఇచ్చాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ అదిరిపోయే రేంజ్ లో డిజైన్ చేశాడు. ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే మూవీ ఇచ్చాడు. టాలీవుడ్, బాలీవుడ్ తేడా లేకుండా అందరూ కనెక్ట్ అయ్యేలా మన భారతీయ సంస్కృతిని జోడించాడు. తెలుగు సినిమాను మరో లెవల్ లో నిలబెట్టాడు. శభాష్ అనిపించుకుంటున్నాడు.

మొత్తానికి నాగ్ అశ్విన్ కష్టానికి తగిన ప్రతిఫలం దొరికింది. మూవీ యునానిమస్ బ్లాక్ బస్టర్ రివ్యూస్ అందుకుంటుంది. ఈ సందర్భంగా నాలుగేళ్ల కష్టానికి ప్రతీకగా.. అరిగిపోయి చిరిగిపోయిన చెప్పులను గర్వంగా పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. తమ హీరోను ఈ లెవల్ లో చూపించినందుకు థాంక్స్ చెప్పుకుంటున్నారు. డార్లింగ్ హ్యూమర్ ను హండ్రెడ్ పర్సంట్ వాడినందుకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.






Advertisement

Next Story

Most Viewed