Kajol : పలుచటి దుస్తులు వేసి.. -27°Cలో నాతో డ్యాన్స్ చేయించారు

by samatah |   ( Updated:2023-05-26 12:33:14.0  )
Kajol : పలుచటి దుస్తులు వేసి.. -27°Cలో నాతో డ్యాన్స్ చేయించారు
X

దిశ, సినిమా: 2006లో వచ్చిన ‘ఫనా’ చిత్రం విడుదలై 17ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాజోల్ ఓ ఆసక్తికర విషయం పంచుకుంది. అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవగా.. ఇందులోని ‘మేరే హాత్ మే’ పాట షూటింగ్ కష్టాలను గుర్తుచేసుకుంది. ‘ఈ సాంగ్ షూటింగ్ మొదటిరోజే పోలాండ్‌లో-27°Cలో మొదలైంది. గడ్డకట్టిన సరస్సుపై పల్చని షిఫాన్ సల్వార్ కమీజ్ ధరించిన నేను నానా కష్టాలు పడ్డాను. అమీర్ మాత్రం కేవలం షూట్ కోసమే స్థానిక మార్కెట్ నుంచి మందపాటి జాకెట్‌ తెచ్చుకున్నాడు. అందుకే గడ్డకట్టిన నా ముఖంలో ఉన్న బాధ అతని ఫేస్ లో లేదు. దీంతో నేను పాటకు న్యాయం చేయలేకపోయా. మొత్తానికి మేము ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత నన్ను మరింత అందంగా చూపించడం కోసం మొత్తం పాటను రీషూట్ చేశారు. నిజంగా మంచులో సాహసాలు చేసే హీరోయిన్లకు సెల్యూట్. #17YearsOfFana’ అంటూ ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది.

Also Read: ఆ డ్రెస్‌లో గుడికొచ్చిన అమ్మాయి.. తిట్టిపోసిన కంగన..

Advertisement

Next Story