జూ. పవన్‌ కళ్యాణ్‌ అంటూ అకిరాపై కామెంట్స్‌! - ఫ్యాన్స్‌పై ఫైర్ అయిన రేణు దేశాయ్‌

by Kavitha |
జూ. పవన్‌ కళ్యాణ్‌ అంటూ అకిరాపై కామెంట్స్‌! - ఫ్యాన్స్‌పై ఫైర్ అయిన రేణు దేశాయ్‌
X

దిశ, సినిమా: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ అనంతరం తన వారసుడిగా తనయుడు అకిరాను అందరికీ పరిచయం చేస్తున్నారు. ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి పరిచయం చేయగా.. నిన్న ఏకంగా ప్రధాని మోదీని ఫ్యామిలీతో సహా కలిసి భేటీ అయ్యారు. ఇక్కడ కూడా అకిరా పవన్ వెంటే ఉన్నాడు. దీంతో అంతా ఇప్పుడు అకిరాను PSPK2 అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా పిఠాపురం ఎమ్మెల్మేగా పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుంచి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పవన్ ని ఉద్దేశిస్తూ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆమె వరుస పోస్టులు షేర్ చేస్తున్నారు. తన తండ్రి కోసం అకిరా ఎడిట్ చేసిన వీడియోని ఇన్స్టా వేదికగా రిలీజ్ చేశారు. దీనిపై పవన్ ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. సూపర్ ఎడిటింగ్, వావ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అలాగే అకిరాను పవన్ కళ్యాణ్ 2 (PK 2) అంటూ అభిమానంగా పిలుచుకుంటున్నారు. అంతేకాదు తొందరగా హీరో అయిపో అన్న అని ఒకరు, ఎడిటర్ అవ్వండి అంటూ మరొకరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక అభిమానుల కామెంట్స్ పై రేణు దేశాయ్ స్పందిస్తూ.. అకిరాను జూనియర్ పవన్ కళ్యాణ్ అంటూ పిలిచిన నెటిజన్లపై ఆమె ఫైర్ అయ్యారు. "అకిరాకు, తన తండ్రికి (పవన్ కళ్యాణ్ కి) గాని తాను జూనియర్ పవన్ కళ్యాణ్ అనిపించుకోవడం ఇష్టం లేదు. కాబట్టి తన ఫీలింగ్‌ని అర్థం చేసుకోని అకిరా నందన్ అని పిలవండి" అంటూ రిప్లై ఇచ్చారు. అలాగే మరో పోస్ట్ లో అకిరా యాక్టింగ్ డెబ్యూ పై స్పందిస్తూ.. అకిరా పుట్టిన క్షణం నుంచి నేను తన అభిమానిగా ఉన్నాను. అతడు ఎప్పుడెప్పుడు నటిస్తాడా అని నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. కానీ అంతకంటే ముందు తల్లిగా అతని నిర్ణయాన్ని, ఫీలింగ్స్ ని గౌరవించాలి. కాబట్టి తరచూ అకిరా సినీరంగ ప్రవేశంపై డిస్కషన్ చేస్తూ నాకు చిరాకు తెప్పించకండి. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను" అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం రేణు దేశాయ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.


Advertisement

Next Story

Most Viewed