అలా కనిపిస్తే తప్ప ఈఎంఐలు చెల్లించలేను : Janhvi Kapoor

by Seetharam |   ( Updated:2022-11-09 13:58:42.0  )
అలా కనిపిస్తే తప్ప ఈఎంఐలు చెల్లించలేను : Janhvi Kapoor
X

దిశ, సినిమా : బీటౌన్‌లో అతి తక్కువ సమయంలో స్టార్‌‌ స్టేటస్ దక్కించుకున్న హీరోయిన్‌ జాన్వీకపూర్. ఆమె రీసెంట్‌గా 'మిలి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ రిలీజైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా జాన్వి నటనపై విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే, తన ఈఎంఐలు ఎలా కడుతుందో తాజా ఇంటర్వ్యూలో వివరించింది జాన్వి. తాను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్న అల్ట్రా గ్లామరస్ ఫొటోలకు, మూవీలో పోషిస్తున్న డీగ్లామరస్ పాత్రలకు అస్సలు పొంతన ఉండదు. ఎందుకిలా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ..

'నిజ జీవితంలో తెరపై కనిపించేదానికి పూర్తి భిన్నంగా ఉంటాను. అలాగే నేను సోషల్ మీడియాలో సరదాగా గడపాలనుకుంటా. ఇలా గ్లామర్ షో చేస్తూ క్యూట్‌గా కనిపిస్తే.. మరో ఐదుగురు వ్యక్తులు నా ఫొటోలను ఇష్టపడటం వల్ల నేను అదనంగా మరొక బ్రాండ్‌ పొందుతాను. ప్రకటనల్లో నటించే అవకాశాలు వస్తాయి. ఆ డబ్బుతో నా ఈఎంఐలు చెల్లిస్తాను. గతంలో కంటే ఇప్పుడు చాలా సులభంగా ఈఎంఐలు చెల్లిస్తున్నాను' అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి :

'కాంతార' మూవీ క్లైమాక్స్ సీన్.. అదరగొట్టిన కమెడియన్ నూకరాజు

యాటిట్యూడ్ చూపిస్తున్న స్టార్ హీరోయిన్.. సినిమా నుంచి తీసేసిన డైరెక్టర్

ప్రెగ్నెన్సీ టైమ్‌లో స్లీపింగ్ డిజార్డర్స్.. ఎందుకు వస్తాయంటే?

Advertisement

Next Story