- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
మహిళలు తాగితే తప్పేంటి? సరదాలు అందరికీ ఉంటాయి.. స్టార్ హీరో భార్య సంచలన కామెంట్స్..!
దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ సతీమణి జీవిత రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె భర్త పేరులో మాత్రమే కాకుండా భర్త కష్ట సుఖాల్లో కూడా బాధ్యతగా వ్యవహరిస్తుంటుంది. అప్పట్లో జీవిత పలు సినిమాల్లో నటించి.. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. ఇంటి గృహిణిగా ఈ నటి ఎంత సైలెంట్‌గా ఉన్నప్పటికీ తన కళ్ల ముందే ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం తప్పకుండా ప్రశ్నిస్తుంది.
స్త్రీ యొక్క బాధ్యతలు అన్నీ తెలిసిన మహిళ కాబట్టి మహిళా హక్కుల కోసం ఆమె గట్టిగా గొంతు వినిపిస్తోంది. అయితే తాజాగా రాజశేఖర్ భార్య ఓ ఇంటర్వ్యూకు హాజరై సోషల్ మీడియాను షేక్ చేసే కామెంట్స్ చేసింది. ‘‘నా ఇంటిని నా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నా లైఫ్ లో ఫస్ట్ ప్రియారిటీ అంటే నా ఫ్యామిలీనే. నా కుటుంబం అవసరాలు వేరే వాళ్లు తీర్చడం నాకు అస్సలు నచ్చదు. ఫ్రెండ్స్ కూడా తక్కువ మంది ఉంటారు కాబట్టి నేను బయటికి వెళ్లడం చాలా తక్కువ.
నేను ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా అస్సలు తాగను. నేను మహిళను కాబట్టి తాగను అనట్లేదు. నాకు ఇష్టం లేదు కాబట్టి తాగను అంటున్నాను. ఒకవేళ ఎవరైన మహిళలు తాగడమేంటి అని ప్రశ్నిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. అక్కడే వారినీ నిలదీస్తా. హ్యాపీ మూమెంట్స్, సరదాలు అందరికీ ఉంటాయి. దానికి జెండర్ తో పనేంటి? అంటూ జీవిత రాజశేఖర్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ నెట్టింట వైరలవ్వడంతో పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
Read More..
దయచేసి పురుషులు ఆ పనికి ఆడదాన్ని వాడుకోవద్దు.. నటి ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్