ఆ విషయంలో అమ్మ పోలికే.. అనుకున్నదే చేస్తా: జాన్వీ Janhvi Kapoor

by sudharani |   ( Updated:2022-11-27 08:11:39.0  )
ఆ విషయంలో అమ్మ పోలికే.. అనుకున్నదే చేస్తా: జాన్వీ Janhvi Kapoor
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. అలాగే సినిమాలతో పాటు ఫ్యాషన్ ప్రపంచంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల 'బ్లెండర్స్‌ ప్రైడ్‌' ఫ్యాషన్‌ టూర్‌లో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన జాన్వీ 'షో స్టాపర్‌' గా అలరించింది. అలాగే 'ఫ్యాషన్ ట్రెండ్ వేగంగా మారిపోతుంది. కాలానికి తగ్గట్టుగా నేను కూడా వాటిని ఫాలో అవుతున్నా. ముఖ్యంగా మన శరీరానికి నప్పే దుస్తులు ధరించాలి. అది మన మూడ్‌ను వ్యక్తం చేసేలా ఉండాలి. మనం ఎంత ట్రెండీగా కనిపించాలని అనుకున్నా.. పరిధి దాటకుండా చూసుకోవాలి. నేను ధరించే ప్రతి డ్రెస్ నాకు నచ్చితే చాలు. ఇతరులకు గురించి పట్టించుకోను. ఎవరు ఎంత చెప్పినా అస్సలు తగ్గను. అనుకున్నదే చేస్తా. ఈ విషయంలో అమ్మ పోలికే' అంటూ వివరించింది.


Also More......


ప్రైవేట్ పార్ట్‌పై పుట్టుమచ్చ చూపించిన అషు.. కుర్రాళ్ల ఫీజులు అవుట్.

Advertisement

Next Story