Janhvi Kapoor :తనను పెళ్లి చేసుకోబోయేవాడు ఎలా ఉండాలో వెల్లడించిన జాన్వి

by Prasanna |   ( Updated:2023-04-24 06:00:46.0  )
Janhvi Kapoor :తనను పెళ్లి చేసుకోబోయేవాడు ఎలా ఉండాలో వెల్లడించిన జాన్వి
X

దిశ, సినిమా: బాలీవుడ్‌లో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా స్టేటస్ సాధించుకుంది జాన్వీ కపూర్. ఇప్పుడు సౌత్‌లోనూ తన క్రేజ్‌ ఇంకా పెంచుకునేందుకు తారక్ జోడీగా ‘ఎన్టీఆర్ 30’ మూవీ‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇక్కడ కూడా సక్సెస్ సాధిస్తే తల్లి శ్రీదేవి‌లా చక్రం తిప్పవచ్చని భావిస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటి తనను చేసుకునే వ్యక్తి ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. ‘‘ నా లైఫ్‌లోకి వచ్చే వ్యక్తి నా వృత్తిని గౌరవించాలి. నాతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. కేరింగ్‌గా చూసుకోవాలి. ముఖ్యంగా నా తండ్రి కంటే ఎక్కువ హైట్ ఉండాలి. అలాంటి వ్యక్తి మాత్రమే కావాలి’’ అని వెల్లడించింది జాన్వీ. అయితే ఆమె ప్రస్తుతం యంగ్ బిజినెస్‌ మెన్ శిఖర్ పహారియా‌తో ప్రేమలో ఉంది. ఈ విషయంపై వారు క్లారిటీ ఇవ్వకపోయినా కలిసి టూర్లు.. షికార్లు మాత్రం తెగ తిరిగేస్తున్నారు.

Read more:

రామ్ చరణ్ జోడిగా జాన్వీ కపూర్..!

Advertisement

Next Story