'అమ్మా.. నీకోసం ప్రతీ చోట వెతుకుతున్నా'.. జాన్వీ ఎమోషనల్ పోస్ట్

by sudharani |
అమ్మా.. నీకోసం ప్రతీ చోట వెతుకుతున్నా.. జాన్వీ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ చాలా కొద్దికాలంలోనే టాలెంటెడ్‌ యాక్ట్రెస్‌గా ప్రశంసలు అందుకుంది. అటు అందంలోనూ తల్లి శ్రీదేవిని తలపించిన బ్యూటీ.. చాలా సందర్భాల్లో తన మదర్‌తో కనెక్షన్ గురించి వివరించింది. ఈ క్రమంలోనే తాజాగా అతిలోక సుందరితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఎమోషనల్ అయింది. 'నేను ఇప్పటికీ నీ కోసం ప్రతి చోట వెతుకుతున్నాను. అమ్మా.. నేను చేసే ప్రతి పని నిన్ను గర్వించేలా చేస్తుంది అని ఆశిస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్లినా, ఏ పని చేసినా, అది నీ స్మరణతోనే మొదలవుతుంది. నీతలపుతోనే ముగుస్తుంది' అంటూ పోస్ట్ పెట్టింది.

Advertisement

Next Story