జాన్వీ వెంటపడుతున్న తెలుగు హీరోస్.. కారణం అదేనా?

by Jakkula Samataha |
జాన్వీ వెంటపడుతున్న తెలుగు హీరోస్.. కారణం అదేనా?
X

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ అమ్మడు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. స్టార్ హీరోల సరసన ఈ అమ్మడు మంచి మంచి ఆఫర్స్ కొట్టేస్తుంది. ప్రస్తుతం జాన్వీ దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన, అలాగే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామ్ చరణ్ సినిమాలో నటిస్తోంది. అయితే ఇవే కాకుండా, ఇంకో రెండు సినిమాల్లో కూడా జాన్వీ మెరవబోతుందంట. ఇదంతా పక్కన పెడితే పుష్ప2లో ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే సినీ ఇండస్ట్రీలో ఇంత మంది హీరోయిన్స్ ఉన్నా, అందరూ జాన్వీనే సెలెక్ట్ చేసుకోవడానికి ఓ కారణం ఉన్నదంట. అది ఏమిటంటే? జాన్వీకి శ్రీదేవి బ్యాక్ గ్రౌండ్ ఉండటం, అతిలోక సుందరి కూతురు అంటే జాన్వీకి తెలుగులో మంచి క్రేజ్ ఉంటుంది. ఇది ఆలోచించే హీరోలందరూ జాన్వీ వెంట పడుతున్నారంట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed