అకీరానంద‌న్‌‌ హీరో కావాలి.. చాలామంది ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారంటూ..

by Prasanna |   ( Updated:2023-10-16 10:40:23.0  )
అకీరానంద‌న్‌‌ హీరో కావాలి.. చాలామంది ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారంటూ..
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరానందన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తండ్రి పోలికలతో అచ్చం హీరోలా ఉంటాడు. అందుకే పవన్ ఫ్యాన్స్ అంతా సినిమాల్లో అతని ఎంట్రీ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే రీసెంట్‌గా మాస్ రాజా ర‌వితేజ‌ హీరోగా న‌టించిన ‘టైగ‌ర్ నాగేశ్వర‌రావు’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. దీనికి జక్కన తండ్రి విజ‌యేంద్ర ప్రసాద్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యాడు. ఈ సందర్భంగా అతను రేణు దేశాయ్‌‌తో అకీర గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విజ‌యేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘అకీర సినీ ఇండ‌స్ట్రీకి దూరంగా ఉండొచ్చు కానీ మాకు మాత్రం ద‌గ్గర‌గానే ఉన్నాడు. త్వర‌లోనే మీ అబ్బాయి అకీరానంద‌న్‌ను హీరోను చేయాలి. ఆ సినిమాలో అకీరాకు త‌ల్లిగా మీరే న‌టించాల‌ని కోరుకుంటున్నా. అతన్ని హీరోగా ప‌రిచ‌యం చేసేందుకు చాలా మంది ప్రొడ్యూస‌ర్స్ సిద్దంగా ఉన్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు విజ‌యేంద్ర ప్రసాద్. ప్రజెంట్ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.


Advertisement

Next Story

Most Viewed