ఒక స్త్రీ గురించి ఇంత భయంకరంగా మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు.. దుమారం రేపుతున్న మెగా కోడలి పోస్ట్

by Kavitha |   ( Updated:2024-10-03 07:36:56.0  )
ఒక స్త్రీ గురించి ఇంత భయంకరంగా మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు.. దుమారం రేపుతున్న మెగా కోడలి పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కొండా సురేఖ స్టార్ హీరోయిన్ సమంత పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందించగా.. తాజాగా మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి స్పందించింది. “ఇప్పటికే గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న కుటుంబం గురించి ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు. ఎందుకు సెలబ్రిటీలను, వారి ఫ్యామిలీను ఎప్పుడూ అంత సులభంగా టార్గెట్ చేస్తారు..? ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఏదైనా చెబుతారు. దయచేసి యూజ్‌ఫుల్ అయ్యే విషయాలపై ఫోకస్ పెట్టండి లేదా ప్రయోజనం కలిగే పనిని అయినా కనిపెట్టండి. అంతేగాని ఇతరుల జీవితానికి సంబంధించి ఆరోపణలు చేస్తే దానిని సినిమా పరిశ్రమ సహించదు” అంటూ మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇన్‌స్టా వేదికగా స్పందించింది.


Advertisement

Next Story

Most Viewed